తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఇక కెరీర్ కి తిరుగు లేదన్నట్టే లెక్క. ఒక్కసారి స్టార్ క్రేజ్ వస్తే చాలు అలా ఫ్లోలో ఒక అరడనుకి పైగా సినిమాలు వచ్చేస్తాయి. కాస్త హీరోయిన్స్ చాకచక్యంగా కథాబలం ఉన్న సినిమాలు చేస్తే అందులో మళ్లీ ఏ ఒకటి రెండు క్లికయ్యాయి అంటే మళ్లీ కెరీర్ ఊపందుకుంటుంది. ఇదే అందరి కెరీర్ లో జరుగుతుంది. ఐతే కొంతమంది భామలు మొదటి సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుంటుంటే.. కొందరు ఆడియన్స్ కు కాస్త అలవాటు అయ్యాక క్రేజ్ తెచ్చుకుంటారు.

ఐతే కొత్తగా వచ్చే భామల్లో ఎవరు బంగారు పాప అయ్యే ఛాన్స్ ఉంది అంటే అందరి వేళ్లు భాగ్య శ్రీ బోర్స్ వైపే చూపిస్తున్నాయి. మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది భాగ్య శ్రీ. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన అమ్మడు తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ చూస్తే భాగ్య శ్రీని ఫుల్లుగా వాడేసినట్టు అనిపిస్తుంది.

ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలు అన్ని మిస్టర్ బచ్చన్ లో ఉన్నాయి. భాగ్య శ్రీ అందాల మీద హరీష్ శంకర్ ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. కచ్చితంగా అమ్మడికి ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ గా చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ పడితే మాత్రం భాగ్య శ్రీ డిమాండ్ ఒక రేంజ్ లో ఉంటుంది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకుండానే భాగ్య శ్రీ విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమాలో నటిస్తుంది. విజయ్ తో ఛాన్స్ అంటే కచ్చితంగా భాగ్య శ్రీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో దక్కించుకుంటుందని చెప్పొచ్చు. రవితేజతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న హీరోయిన్స్ అంతా కెరీర్ లో టాప్ ప్లేస్ కి వెళ్లారు. ఆ సెంటిమెంట్ తో చూస్తే భాగ్య శ్రీ కి కూడా లక్కు తగిలినట్టే అని చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: