అక్కినేని ఇంట పెళ్లి భాజలు మరొకసారి మోగనున్నాయి.. తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ అయినా శోభిత ధూళిపాళ్ల గత కొద్ది రోజుల నుంచి వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లుగా పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాలన్నీ కూడా రూమర్సే అన్నట్లు ఎన్నోసార్లు అటు శోభిత నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ విషయాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇప్పుడు శోభిత ,నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఈరోజు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రేపటి రోజున నాగార్జునని స్వయంగా విడుదల చేస్తారని కూడా సమాచారం.


పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలు కూడా స్వయంగా నాగార్జున అని తెలియజేసే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మొదట హీరోయిన్ సమంతను, నాగచైతన్య కొన్నేళ్ల పాటు ప్రేమించు మరి వివాహం చేసుకొని కొన్ని మరి విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాగ చైతన్య ,శోభితతో ప్రేమలో పడినట్లుగా తెలిస్తోంది. హీరోయిన్ శోభిత  విషయానికి వస్తే ఈమెది గుంటూరు జిల్లా తెనాలి.. 2013లో మిస్ ఇండియా టైటిల్ని కూడా గెలుచుకుందట.


అతి తక్కువ సమయంలో మోడల్ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2016 లో బాలీవుడ్ లో ఒక సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 2018 లో అడవి శేషు నటించిన గూడచారి చిత్రంతో హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాలను వెబ్ సిరీస్లలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గతంలో కూడా నాగచైతన్య, శోభిత  ఇద్దరూ కూడా ఒకే చోట ఉన్న సందర్భాలలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. మరి ఎంగేజ్మెంట్ వస్తున్న వార్తల పైన అటు అక్కినేని కుటుంబం కానీ శోభిత కానీ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: