శ్రీదేవి , బోని కపూర్ ల కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలా సంవత్సరాల క్రితమే హిందీ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ కి హిందీ నటా మంచి గుర్తింపు లభించింది. ఈమె ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించిన అందులో ఎక్కువ సినిమాలు లేడీ ఓరియంటెడ్ మూవీలే కావడం విశేషం. ఇకపోతే హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి మరి కొంత కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన మొదటి భాగం షూటింగ్ ను కూడా జాన్వి పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ కి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే మరో సినిమాలో కూడా అవకాశం దక్కింది. ఈ సినిమా షూటింగ్ మరి కొంత కాలంలోనే స్టార్ట్ కాబోతోంది.

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ కి తెలుగు సినిమాల నుండి భారీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఆమెకు వస్తున్న ప్రతి ఆఫర్ విషయంలో కూడా బోనీ కపూర్ ఆచితూచి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు , కథను ఒకటికి రెండు సార్లు వింటున్నట్లు , అలాగే కథలో ఏమైనా మార్పులు , చేర్పులు ఉన్న కానీ జాన్వి కంటే ముందే బోనీ కపూర్ వాటిని మేకర్స్ కు చెబుతున్నట్లు తెలుస్తోంది. అలా జాన్వి నటించబోయే కథల విషయంలో బోనీ కపూర్ అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నట్లు , ఆమె ఏ సినిమాల నటించాలో , నటించకూడదు కూడా ఆయనే దాదాపుగా డిసైడ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తన కూతురి భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: