ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని మొదట ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అందుకు అనుగుణంగా ఈ సినిమా ప్రచారాలను కూడా మొదలు పెట్టారు. ఇక కొంత కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన సూసేకి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదల అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకోవడం మొదలు పెట్టింది. ఇప్పటికీ కూడా ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈ సాంగ్ కి యూట్యూబ్ లో వ్యూస్ అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయి. తాజాగా ఈ సాంగ్ అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంది. ఈ సాంగ్ తాజాగా యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ ను అందుకుంది.

ఇలా ఆగస్టు 15 వ తేదీ నుండి ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీకి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాపై , ఈ సినిమా పాటలపై ప్రేక్షకుల్లో ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు అనే దానికి ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ఉదాహరణగా చూపించవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ నిజాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేసి చూడాల్సిందే. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనుండగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa