అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో గొప్ప స్థాయిని సంపాదించుకుంది. లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈమె చందమామ మూవీ తో మొదట కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె మగధీర సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఏకంగా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత నుండి ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కడం మొదలు అయింది. 

దాదాపు ఈమె తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించింది. అందులో చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లడం మాత్రమే కాకుండా అనేక సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఈమె అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఈమె ఒక పండంటి బిడ్డ కి జన్మనిచ్చింది. 

పెళ్లి ఆ తర్వాత బిడ్డకు జన్మను ఇచ్చాక కూడా ఈమె వరస సినిమాలలో నటిస్తోంది. ఈమె ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఈ బ్యూటీ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ బ్యూటీ యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఇప్పటికి కూడా ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ తన అందాలతో కుర్రకారుకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: