తెలుగులో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీతో డైరెక్టర్ గా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో రవితేజ హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ తర్వాత మిరపకాయ్ సినిమాకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్మూవీ తో కమర్షియల్ గా సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన తెరకెక్కించిన గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈయన క్రేజ్ తెలుగులో అమాంతం పెరిగిపోయింది.

తాజాగా ఈ దర్శకుడు రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా హిందీ మూవీ అయినటువంటి రైడ్ కి అధికారికంగా రూపొందింది. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. అందుకు గాను ఈ మూవీ యూనిట్ ఓ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేసింది.

ఈవెంట్ లో భాగంగా హరీష్ శంకర్ పాత్రికేయలతో ముచ్చటించాడు. ఇక ఈ పాత్రికేయుల సమావేశంలో భాగంగా హరీష్ శంకర్ కి మహేష్ బాబు తో సినిమా గురించి చాలా సార్లు మాట్లాడారు. ఆయనతో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా అనే ప్రశ్న ఎదురయింది. దానికి హరీష్ శంకర్ సమాధానం ఇస్తూ ... మహేష్ బాబుతో సినిమా గురించి ఆయన ఫ్యాన్స్ అడుగుతున్నారు. మహేష్ బాబు కెరియర్ లో పోకిరి సినిమా ఒక అద్భుతమైన మూవీ. అది ఓ నాకు ఒక టెస్ట్ బుక్ లాంటిది. ఆయనతో ఒక వేళ సినిమా చేస్తే పోకిరి లాంటి సినిమా చేస్తాను అని హరీష్ శంకర్ తాజాగా చెప్పకచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: