అందరూ అనుకున్నదే జరిగింది.. ఎట్టకేలకు నాగచైతన్య శోభిత ధూళిపాలలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా నాగార్జున ఇచ్చేశారు. ఇన్ని రోజులుగా నాగచైతన్య శోభిత ధూళిపాలలు డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలకు ఇప్పటితో తెరపడింది. కానీ వీళ్లు తమ మధ్య ఇంత బంధం పెట్టుకొని బయటికి మాత్రం మా మధ్య ఏమీ లేదు అంటూ భలే నటించారు అనుకుంటున్నారు ఇప్పుడు వీరి ఫోటోలు చూసిన చాలా మంది జనాలు. అయితే అలాంటి నాగచైతన్య, శోభితా ల మధ్య ప్రేమ ఎక్కడ పుట్టింది.. వీరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఆమేనేనా అనేది ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య శోభితల మధ్య లవ్ పుట్టడానికి ప్రధాన కారణం  నాగార్జున మేనకోడలు సుప్రియ అని తెలుస్తోంది. 

ఇక విషయంలోకి వెళ్తే..అడివి శేష్ హీరోగా చేసినా గూఢచారి సినిమాలో శోభిత ధూళిపాల హీరోయిన్ గా చేసింది. అయితే ఇదే సినిమాలో సుప్రియ కూడా నటించింది.ఇక సుప్రీత తో ఉన్న సాన్నిహిత్యంతో శోభిత ధూళిపాల ఇంటికి వచ్చిన సమయంలో నాగచైతన్య శోభితాలు మొదటిసారి కలుసుకున్నారట. అలా వీరి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. ఆ టైంలోనే డేటింగ్ చేసినట్టు కూడా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి అయితే అప్పటికి సమంత నాగచైతన్యలు విడిపోలేదు. ఇక వారి విడాకులకు శోభిత కూడా ఒక కారణం అని వీరి ఎంగేజ్మెంట్ తో మరిన్ని రూమర్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఏది ఏమైనప్పటికి చివరికి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించుకొని ఇలా ఎంగేజ్మెంట్ తో ఒక్కటయ్యారు. అలా ఒకరకంగా నాగచైతన్య శోభిత ధూళిపాలను కలవడానికి సుప్రియ యార్లగడ్డ కారణమైనట్టు తెలుస్తుంది. కానీ కొంతమంది వీరి రిలేషన్ ని ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్లు నాగచైతన్య పక్కన సమంతని మాత్రమే భార్యగా ఊహించుకుంటున్నారు.అయితే గతంలో సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు కూడా సమంత ఇంకా నాగచైతన్యనే ప్రేమిస్తుందని,ఆయన్ను వదులుకున్నందుకు ఇప్పటికీ ఎంతగానో బాధపడుతుందని,మళ్లీ వాళ్ళిద్దరూ కలుస్తారని ఆయన మాట్లాడారు. కానీ ప్రస్తుతం మాత్రం నాగచైతన్య శోభిత ధూళిపాలలు ఎంగేజ్మెంట్ తో ఒక్కటయ్యారు. మరి వీరిని  చూసి సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమవుతుందా లేదా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: