ఇటీవల సినిమా వాళ్లకు ఎంతో ఇష్టమైన కుమారదేవం చెట్టు నేలకూలిన విషయం తెలిసిందే. ఈ చెట్టు తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామంలో ఉంది. దీని వయసు 150 ఏళ్ల కంటే ఎక్కువే. గోదావరి నది తీరాన ఉన్న ఈ గన్నేరు చెట్టు కొద్ది రోజుల క్రితం గోదావరి నది ఉధృతికి నేలకొరిగింది. దాంతో ఈ చెట్టుతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న దర్శకులు నటీనటులు కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు వంశీ ఈ చెట్టుతో చాలా గొప్ప అనుబంధం కలిగి ఉన్నాడు.

ఆయన ప్రతి సినిమాలో కూడా ఈ చెట్టును చూపించేవాడు. గోదారి గట్టు మీద ఉన్న ఈ చెట్టు కింద ఎన్నో సన్నివేశాలను చిత్రీకరించాడు. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా హిట్ కావడానికి ఈ చెట్టు కూడా ఒక కారణమని అంటారు. ద‌ర్శ‌కుడు వంశీ ఈ చెట్టు కూలిందని తెలుసుకొని తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు స్వయంగా ఆ చెట్టు వద్దకు వెళ్లి కంటతడి కూడా పెట్టుకున్నాడు. తన సొంత చెల్లి చనిపోయిందంటూ ఆయన బోరున విలపించారని సమాచారం. చిన్న‌ప్పుడు ఇక్కడే వంశీ ఆడుకునేవాడ‌ని ఆ ఊరి ప్రజలు తెలిపారు.

వంశీ చాలా ఏళ్లుగా ఆ చెట్టును చూస్తూ పెరిగాడు. ప్రతి సినిమాలో దానిని చూపించాడు. ఈ చెట్టు కూలిన విష‌యాన్ని ద‌ర్శ‌కుడు వంశీ చెట్టుని సందర్శించగానే ఎంతో ఎమోషనల్ అయ్యాడు. చెట్టును చివ‌ర‌చూపు చూద్దామని అక్కడికి వెళ్లినట్లు ఆయన తెలుపుతూ బాధపడ్డాడు. గోదారమ్మ ఉధృతిగా పొంగకుంటే ఈ చెట్టు ఇంకో 100 సంవత్సరాలు కచ్చితంగా బతికుండేదని పలువురు పేర్కొంటున్నారు.

ఇకపోతే దాదాపు 300కి పైగా తెలుగు సినిమాలు ఈ చెట్టు కింద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించుకున్నాయి. వంశీతో పాటు కె విశ్వనాథ్‌, జంధ్యాల, బాపు, రాఘవేంద్ర రావు ఈ చెట్టు కింద చాలా సన్నివేశాలను తీశారు. కొద్ది రోజుల క్రితం కూడా రామ్ చ‌ర‌ణ్ మూవీ "గేమ్ ఛేంజ‌ర్" షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఈ చెట్టు కింద సినిమా తీయడం చాలా అదృష్టమని ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఒక సెంటిమెంట్ ఉంది అందుకే ఇప్పటికీ దీని కింద సన్నివేశాలు తీసేవారు ఉన్నారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ చెట్టును బతికించాలంటూ చాలామంది కోరుతున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు దీనిని ఆధునిక పద్ధతులలో బతికించాలని ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: