కన్నడ సూపర్ స్టార్ యష్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'టాక్సిక్' షూటింగ్‌ను ప్రారంభించారు. ఇండస్ట్రీ వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. యష్ ఫ్యాన్స్‌కు ఈ వార్త ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది. 'కేజీఎఫ్' సిరీస్ తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్, తన తదుపరి చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. టాక్సిక్ అనే టైటిల్ సినిమా కథాంశానికి ఎంతవరకు సరిపోతుందో చూడాలి. ఇక ఈ

 సినిమాను మళయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ప్లాన్ చేసారు. ఈ భారీ యాక్షన్ అండ్ గ్యాంగ్ స్టర్ డ్రామాపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ తదితర భారీ తారాగణం నటిస్తున్నారు. ఇకపోతే యష్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. 'కేజీఎఫ్' తర్వాత యష్ నటించే చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ కన్నడ హీరో  కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. 'రాకీ', 'కేజీఎఫ్' సిరీస్ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌కు మరింత

 హైట్ ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు. ఇక 'టాక్సిక్' చిత్రం యష్ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇకపోతే ఈ చిత్రంపై యష్ లేటెస్ట్ గా ఇచ్చిన ఒకటి అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏంటంటే... ఒక పిక్ పెట్టి జర్నీ ఇప్పుడే మొదలైంది అంటూ తాను పోస్ట్ చేసాడు. దీనితో యష్ ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఇందులో యష్ లుక్ కూడా మంచి స్టైలిష్ గా కనిపిస్తుండడంతో ఈ సినిమా నుంచి మాత్రం తమకి మంచి ట్రేట్ ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అలాగే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: