కొరటాల శివ డైరెక్షన్లో.. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్.. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కబోతున్న సినిమా దేవర.. ఈ సినిమాలో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్.. కథానాయకగా జాన్వి కపూర్ నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో సహా తొలి రెండు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి రెండో పాట విడుదలతో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక దేవర సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి జనతా గ్యారేజ్ సినిమాలను చేశారు ఊసరవెల్లి కొంత నిరాశకు గురిచేసిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ను సొంతం చేసుకుంది ఇక వీరిద్దరి కాంబినేషన్ పై వచ్చే ఈ సినిమా సూపర్ హిట్ను సొంతం చేసుకుంటుంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.. దీంతో దేవర సినిమా నుంచి రెండవ పాట విడుదల కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయాయి..తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చుట్ట మల్లె సాంగ్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.. పాటను రిలీజ్ చేసిన చిత్ర బృందం 24 గంటల్లోనే రికార్డును సృష్టించింది..ఈ పాటను రామజోగయ్య శాస్త్రి గీత రచయితగా అనిరుద్ సంగీత దర్శకత్వంలో సూపర్ హిట్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా మొదటి సాంగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్లిపోతోంది.ఈ నేపథ్యంలో దేవర నుంచి రిలీజ్ అయిన చుట్ట మల్లె సాంగ్ లిరిక్స్ అదిరిపోయారని లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రిని నెటిజన్లు అభినందిస్తున్నారు. సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి గారు అని ఓ నెటిజన్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఆయన స్పందించారు. "కిక్కురా కిక్కు "మీ ప్రేమే నా నెక్స్ట్ సాంగ్ కి ఎనర్జీ ఆయుధ పూజ సాంగ్ కు ఇంతకుమించి సెలెబ్రేట్ చేసుకుందాం అని రాబోయే సాంగ్ పై హైప్ పెంచారు.ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: