మలయాళం నటుడుగా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు అయ్యాడు ఫహద్ ఫాజిల్. మలయాళం లో ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించిన ఈ నటుడు తెలుగులో మాత్రం అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంతో విలన్ గా పరిచయమయ్యారు. అప్పటినుంచి తెలుగులో తన సినిమాలను డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ ఉన్నారు.  ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే పలు చిత్రాల నుంచి కూడా అప్డేట్లను తెలియజేస్తూ ఉన్నారు.


ఫహద్ ఫాజిల్ తన కెరీర్లో కేరళ రాష్ట్ర అవార్డులతోపాటు ఫిలింఫేర్ అవార్డులు కూడా చాలానే అందుకున్నారు. 2002లో ఈయన తండ్రి ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారట. మొదట్లో అంతగా సక్సెస్ కాలేకపోయినా ఈ నటుడు 2010లో మళ్ళీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇచ్చారట. 2011లో వచ్చిన చప్పా కురీశు అనే చిత్రంతో రాష్ట్రస్థాయిలో కూడా అవార్డు అందుకున్నారు.ఆ తర్వాత నటనపరంగా తిరిగి చూసుకోలేదు. అతి తక్కువ సమయంలో మాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించారు..ఫహద్ ఫాజిల్.


ఫహద్ ఫాజిల్ , ప్రముఖ హీరోయిన్ నజ్రియాను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అయితే వాహద్ పెళ్లి చేసుకొనే సమయానికి ఫహాద్ వయసు 32 సంవత్సరాలు నజ్రియా వయసు 19 ఏళ్ళు దాదాపుగా వీరిద్దరి మధ్య 13 ఏళ్లు గ్యాప్ ఉన్నదట. 2014లో వీరు వివాహం చేసుకున్నారు. నజ్రియా,ఫహద్ ఫాజిల్ కాంబినేషన్లో వచ్చిన బెంగళూరు డేస్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. అయితే ఇందులో కూడా నజ్రియా భర్తగా ఫహాద్ నటించారట.. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య బాగా పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. లేట్ అయితే  వీరి ప్రేమను రెండు కుటుంబ సభ్యులు ఎక్కడ ఒప్పుకోరు అనే భయపడి వెంటనే వివాహం చేసుకున్నారట. అందుకు కారణం ఫహద్ లాంటి భర్త తనకు మిస్ అవుతాడని చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది నజ్రియా.

మరింత సమాచారం తెలుసుకోండి: