పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఇండస్ట్రీ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 6 న రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్ కు సుకుమార్ కు మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సమస్యలు తొలిగిపోయి పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కనీవినీ యాక్షన్ సీన్లను షూట్ చేస్తున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.తాజాగా అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ నటుడు ఫహాద్ ఫాజిల్ బర్త్ డే కావడంతో ‘పుష్ప 2‘ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేశఆరు.  ‘పుష్ప’ సినిమాలో పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ అదిరిపోయే నటనతో అలరించారు. ‘పుష్ప 2’లో ఆయన క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలో షెకావత్ సార్ పాత్ర ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారట. ఇవాళ (ఆగష్టు 8) ఆయన బర్త్ డే కావడంతో ‘పుష్ప 2’ నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఊరమాస్ పోలీస్ లుక్ లో ఆకట్టుకున్నారు. పైనా పోలీస్ చొక్కా, కింద లుండీ, ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో రివాల్వర్ పట్టుకుని కనిపించారు. కలప స్మగ్లర్లను వేటాడుతున్నట్లు అర్థం అవుతోంది.  ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ అవమానానికి ఈ చిత్రంలో ఆయన గట్టిగా ప్రతీకారం తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆయన మాస్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.మొత్తానికి పుష్ప-2 మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ తన రివెంజ్ ఏ రేంజ్‌లో తీర్చుకుంటాడో అనే ఆసక్తిని మేకర్స్ ఈ పోస్టర్‌తో క్రియేట్ చేశారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: