అదేమిటంటే వీరిద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందనే విషయం పైన అభిమానులు ఆర తీయగా.. ఒక విషయం బయట పడింది.. శోభిత 1992 మే 31న జన్మించగా.. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్ళు. ఇక అక్కినేని నాగచైతన్య 1986 నవంబర్ 23న జన్మించారు. ఇక చైతు వయసు 37 సంవత్సరాలు.. ఈ లెక్కన చూసుకుంటే చైతు ,శోభితాల మధ్య ఏజ్ గ్యాప్ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నది.. గతంలో కూడా ఎన్నోసార్లు ఈ జంట కనిపించిన ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడలేదు.
ముఖ్యంగా ఒక రెస్టారెంట్లో ఈ జంట కనిపించడంతో వీరిద్దరూ డైటింగ్ చేస్తున్నారని విషయం మరింత బలాన్ని చేకూర్చింది. శోభిత ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇతర భాషలలో కూడా నటిస్తూ మెప్పిస్తూనే ఉన్నది.. శోభిత తల్లిదండ్రులు కూడా స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తెనాలి ప్రాంతంలోని వారు.. ఎట్టకేలకు ఈ రోజున శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ గా మారడంతో పెళ్లి డేట్ విషయం గురించి కొన్ని రకాల వార్తలను వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన ఈ జంట తెలియజేస్తారేమో చూడాలి. నాగచైతన్య ప్రస్తుతం తండెల్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. శోభిత కూడా పలు చిత్రాలలో నటిస్తోంది.