ఐతే సమంత సిటాడెల్ కోసం 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఐతే ఆ విషయం తెలిసి బాలీవుడ్ మిగతా హీరోయిన్స్ అంతా కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈమధ్య వచ్చిన ప్రభాస్ కల్కి సినిమా కోసం దీపిక పదుకొనె కూడా 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అంటే కల్కిలో దీపిక ఎలానో సిటాడెల్ కి సమంత అలా అన్నమాట. దీపిక పదుకొనే రేంజ్ సమంత్ రెమ్యునరేషన్ తీసుకోవడం పట్ల సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
సమంత ప్రస్తుతం సిటాడెల్ తర్వాత తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఈ సినిమా విషయంలో కూడా సమంత ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా సౌత్ సినిమాల కన్నా బాలీవుడ్ మీదే పెట్టిందని అర్ధమవుతుంది. అందుకు తగినట్టుగానే అమ్మడికి అక్కడ ఆఫర్లు వస్తున్నాయి. అంతేకాదు సమంత రాజ్ అండ్ డీకే నెక్స్ట్ చేయబోతున్న సీరీస్ లకు కో ప్రొడ్యూసర్ గా కూడా చేస్తుందని తెలుస్తుంది. మరి సమంత దూకుడు చూస్తుంతే బాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా షాక్ ఇచ్చేలా ఉంది. మరో రెండు సినిమాలు బాలీవుడ్ లో చేస్తే మాత్రం సమంత అక్కడ తిరిగులేని క్రేజ్ తెచ్చుకునేలా ఉంది.