ఎయిర్ పోర్ట్‌లో మహేష్ బాబు సరికొత్త గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను కనువిందు చేశారు. తన భుజానికి లగ్జరీ లూయిస్ విట్టన్ బ్యాగ్ వేసుకుని మహేష్ దర్శనమిచ్చారు. అలాగే క్యాప్ పెట్టుకుని, నల్ల కల్లజోడుతో స్టైలిష్ లుక్‌లో ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌తో ఉన్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే మూవీ కోసమే మహేష్ తన లుక్‌ను కొత్తగా మార్చుకున్నారని, హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా మార్చేశారని తెలుస్తోంది. రాజమౌళి మూవీస్‌లో హీరోల జుట్లు కాస్త పెద్దగానే కనపడతాయి. అలాగే కొత్త సినిమాలో కూడా మహేష్ పొడవాటి జుట్టుతో కనిపిస్తాడని పలువురు చర్చించుకుంటున్నారు. మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో రూపొందే ఈ మూవీ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది.
యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కే ఈ మూవీ ఏకంగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ను కూడా వేశారు. ఇకపోతే మహేష్ బర్త్ డే సందర్భంగా విదేశాల్లో సైతం ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం మహేష్ బాబు ఫోటోలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్‌ను చిన్నారుల గుండెచప్పుడు అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.