ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో హీరోలు ఏకంగా నేరస్తులుగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు శాంతి భద్రతలకు విగాథం కలిగే పాత్రల్లో కూడా నటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటివి చూసి అభిమానులు మరింత ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే ఇలాంటి పాత్రలు చేసినప్పుడు ఆయా హీరోలు ఇది కేవలం సినిమాలో పాత్ర మాత్రమేనని.. ఇలాంటివి చూసి అస్సలు ప్రభావితం కావొద్దు అని ముందుగా సూచించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అయితే ఇక ఇప్పుడు హీరో రామ్ పోతినేని అభిమానులకు ఇలాంటి సూచనలు చేశాడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాకు ఇది సీక్వల్ గా రాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం రామ్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ప్రమోషన్స్ లో మాట్లాడుతూ డబుల్ ఇస్మార్ట్ మూవీలో శంకర్ పాత్ర మెంటల్, మాస్, మాడ్నెస్ తో ఉంటుందని రామ్ చెప్పుకొచ్చాడు. ముంబైలో బిగ్ బుల్ పాట రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తను శంకర్ను ప్రమోట్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఉండాలని ప్రయత్నిస్తే మాత్రం మీరు అరగంటలో జైల్లో ఉంటారు అంటూ అభిమానులను హెచ్చరించాడు. శంకర్ పాత్ర కేవలం స్క్రీన్ పై ఎంజాయ్ చేయడానికి మాత్రమే బాగుంటుంది అంటూ రామ్ పోతినేని తన సినిమాలో పాత్ర గురించి బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేశాడు.