అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. ఇక పెళ్లి తర్వాత సమంత ఎక్కువగా బోల్డ్ సినిమాలు చేయడం ప్రారంభించింది. అంతేకాదు సమంత డ్రెస్సింగ్ కూడా పూర్తిగా మార్చేసింది. అయితే పెళ్లి తర్వాత సమంతకి పిల్లలను కనడం ఇష్టం లేదు అని.. కుటుంబ విలువలు పాటించడం లేదు అని అందుకే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చేసాడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 అయితే విడాకుల తర్వాత సమంత తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం  తో ప్రేమలో ఉంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాదు వీళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సమంతా అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సమంత నాకు అక్కతో సమానం. మా బంధం ఏమిటో నాగ చైతన్యకు కూడా తెలుసు. అనవసరంగా నన్ను వివాదంలోకి లాగవద్దని ప్రీతమ్ వేడుకున్నాడు. ప్రీతమ్ తో ఎఫైర్ లో ఉందంటూ వార్తలు వచ్చినా సమంత పట్టించుకోలేదు.

 అతడితో తన స్నేహాన్ని కొనసాగిస్తోంది. కాగా నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఆగస్టు 9న నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ క్రమంలో ప్రీతమ్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ప్రీతమ్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో.. శుభాకాంక్షలు పతిత, ఇప్పుడు అతడు నీ వాడు. రహస్యాలు, అబద్ధాలు బంధాలను నాశనం చేస్తాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతారు, అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్స్ నాగ చైతన్య, శోభితను ఉద్దేశించే అనే వాదన మొదలైంది. ప్రీతమ్ పరోక్షంగా శోభితపై ఘాటైన కామెంట్స్ చేశాడు. ప్రీతమ్ కామెంట్స్ పరిశీలిస్తే అసలు సమంత-నాగ చైతన్య విడిపోవడానికి శోభితనే కారణం అనిపిస్తుంది. శోభితతో రిలేషన్ పెట్టుకున్న నాగ చైతన్య సమంతను మోసం చేశాడు. ఈ విషయం తెలిసి సమంత విడాకులు తీసుకుందని అర్థం వచ్చేలా ప్రీతమ్ కామెంట్స్ ఉన్నాయనే చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: