ప్రస్తుతం టాలీవుడ్ లో ఏదైనా సెన్సేషనల్ న్యూస్ ఉంది అంటే అది అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాలల ఎంగేజ్మెంటే.. వీరిద్దరూ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరిని ఆశ్చర్యంలో ముంచేశారు. ఎన్నో రోజులుగా వీరిపై డేటింగ్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నా కూడా అది పూర్తిగా అబద్ధం అన్నట్లు కరాకండిగా చెప్పేసి చివరికి ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను బయట పెట్టడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. ఇక నాగచైతన్య ఇప్పుడప్పుడే రెండో పెళ్లి చేసుకోరు అని కూడా చాలామంది అనుకున్నారు.కానీ ఆయన అందర్నీ షాక్ లో ముంచేత్తి పెళ్లికి రెడీ అయ్యారు.అయితే నాగచైతన్యను రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన శోభిత ధూళిపాలకు సంబంధించి ఇప్పటికే  ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఆమె ఎక్కడ పుట్టింది..ఆమె తల్లిదండ్రులు ఎవరు..ఏం చదివింది.. ఆస్తి పాస్తులు ఎన్ని.. ఇలా ఎన్నో వార్తలు ఇప్పటికే మీడియాలో వచ్చే ఉంటాయి. అయితే సెలబ్రెటీలకు సంబంధించి పెళ్లి,లవ్ న్యూస్ మీడియాలో వైరల్ అయితే వారికి సంబంధించిన గత లవ్ వ్యవహారాలు కూడా బయటపడతాయి. అయితే నాగచైతన్యకు ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఉన్నట్లే శోభిత కూడా గతంలో ఓ వ్యక్తిని ప్రేమించింది. అంతే కాదు పెళ్లి కూడా చేసుకోవాలనుకుందనే టాక్ వినిపించింది. కానీ చివరికి ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది.

అయితే శోభిత, నాగచైతన్య కంటే ముందు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఎవరో కాదు ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ అలాగే లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ సహా వ్యవస్థాపకుడు అయినటువంటి ప్రణవ్ మిశ్రా. ప్రణవ్ తో శోభితా ప్రేమలో పడింది. వీరిద్దరూ 2019లో జరిగిన ఒక ఫ్యాషన్ ఈవెంట్లో కలుసుకొని కొద్దిరోజులు డేటింగ్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో కానీ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు.ఇక చాలా రోజుల నుండి సింగిల్ గా ఉన్న శోభిత ధూళిపాల త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా ఎంట్రీ ఇవ్వబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: