మాస్ మహారాజా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ సినిమా మిస్టర్ బచ్చన్. హరి శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా బాలీవుడ్లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన రైడ్ అఫీషియల్ రీమేక్ గా మిస్టర్ బచ్చన్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు వారం రోజులు మాత్రమే ఉన్న బచ్చన్ సాబ్ ప్రమోషన్స్ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్నీ కూడా నిర్వహించారు. కాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్

 ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు బచ్చన్ నిర్మాతలు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు పీపుల్స్ మీడియా సభ్యులు. ఒకవేళ పవన్ ఒకే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ రాకుంటే ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని మరొక ప్లాన్ వేస్తున్నారు. రవితేజకు పవన్ కు, అలాగే పీపుల్స్ నిర్మాతలకు మధ్య మంచి స్నేహపూర్వక బంధం ఉంది. అందుకోసమైన పవన్ వస్తారని అనుకుంటున్నారు

 యూనిట్. నేడో రేపో ప్రీ రిలీజ్ ఈవెంట్ వ్యవహారంపై క్లారిటీ రానుంది. ఇక మాస్ మహారాజ రవితేజ హిట్స్ కోసం చాలా చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయారు రవితేజ. మధ్యలో వరుసగా సినిమాలు చేసినా అవి యావరేజ్ గానే నిలిచాయి. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసినిమాతో మాస్ రాజా హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: