తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్న వారిలో గోపీచంద్ ఒకరు. ఈయన తొలి వలపు అనే సినిమాతో హీరోగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఆ తర్వాత ఈయనకు సినిమాల్లో హీరోగా అవకాశాలు దక్కలేదు. ఆ టైమ్ లో తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన జయం సినిమాలో ఈయనకు విలన్ ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించిన ఈయనకు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుసగా వర్షం , నిజం సినిమాలలో గోపీచంద్ విలన్ గా నటించాడు.

ఆ తర్వాత మళ్లీ హీరోగా నటించడం మొదలు పెట్టాడు. ఇక ఈయన యజ్ఞం మూవీ తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి కూడా సినిమాల్లో హీరోగానే నటిస్తూ వస్తున్నాడు. ఈయన కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా గోపీచంద్ కు మీరు ఏదైనా సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనుకొని సినిమా విడుదల అయిన తర్వాత ఆ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకొని సినిమా ఏదైనా ఉందా అనే ప్రశ్న ఎదురైందిఎం దీనికి గోపీచంద్ సమాధానం ఇస్తూ ... కొన్ని సంవత్సరాల క్రితం ఒక్కడున్నాడు అనే సినిమాలో హీరో గా నటించాను.

మూవీ బాంబే బ్లడ్ గ్రూప్ అనే లైన్ పై ఆధారపడి ఉంటుంది. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆ మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంటుంది అనుకున్నాను. కానీ సినిమా విడుదల అయిన తర్వాత ఆ సినిమా మేము అనుకున్న స్థాయి విజయం అందుకోలేదు. ఆ సినిమా ఆ టైమ్ కి రావడం వల్లే  ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని నాకు అనిపిస్తుంది. ఆ సినిమాను ఈ టైమ్ లో తీసి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేది అని నేను అనుకుంటున్నాను. అలా అతనొక్కడే సినిమా రాంగ్ టైమింగ్ వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc