తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ ఈమేజ్ కలిగిన సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరు కూడా చాలా సంవత్సరాలుగా అద్భుతమైన విజయాలను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఈమేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలపడతాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. చిరంజీవి , బాలకృష్ణ హీరోలుగా రూపొందిన సినిమాలు కూడా చాలా సార్లు సంక్రాంతి బరిలో నిలచాయి.

అందులో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి , బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి పండుగకు మూడు సార్లు తలపడ్డారు. అందులో ఎవరు గెలుపొందారు అనే విషయాన్ని తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. ఈ సినిమాలలో మృగరాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాగా , నరసింహ నాయుడు మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 2016 వ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 , బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డాయి.

ఇందులో గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ మంచి విజయాన్ని సాధించగా , ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి , చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడగా ఇందులో వీర సింహా రెడ్డి మూవీ మంచి విజయాన్ని అందుకోగా వాల్టేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా ఇద్దరు ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్యకాలంలో సంక్రాంతి పండుగకు మూడు సార్లు తలపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: