మెగాస్టార్ చిరంజీవి స్టోరీస్ సెలక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆయన హీరోగా రూపొందిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఎవరైనా దర్శకుడు చిరు కి కథను వినిపించాడు అంటే ఆ కథలో ఎలాంటి లోపాలు ఉన్నాయి అనేది చెప్పడం , దాదాపు ఆ స్టోరీ తో పాటు ఆయన కూడా ట్రావెల్ చేయడం , సినిమా స్టోరీ డెవలప్మెంట్ లో కీలక పాత్రను పోషిస్తూ ఉంటాడు. దానితో చాలా మంది దర్శకులు కూడా చిరంజీవి ఇచ్చే ఇన్పుట్స్ అద్భుతంగా ఉంటాయి. ఆయన ఒక డౌట్ చెప్పాడు అంటే దానికి మనం రిటర్న్ గా సొల్యూషన్ చెబితే ఆయన మనకు సపోర్ట్ చేస్తాడు.

ఒకవేళ ఆ డౌటుకు మనం సొల్యూషన్ ఇవ్వకపోతే మరో వర్షన్ రాసి చెబితే అది నచ్చితే ఓకే చెబుతారు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి , ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా .. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండే చిరు "విశ్వంభర" మూవీ కథను మాత్రం చాలా తొందరగా ఓకే చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇక ఈ మూవీ దర్శకుడు వశిష్ఠ కూడా ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. చిరు కెరియర్ లో టాప్ 3 లో ఉంటుంది అని చెబుతూ వస్తున్నాడు. దానితో చిరు ఈ సినిమా కథను చాలా తొందరగా ఓకే చేయడం , వశిష్ట కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెబుతూ ఉండడంతో విశ్వంభరా మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంటుంది అని మెగా ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: