తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు అనే విషయం మనకు తెలిసిందే. మహేష్ తన కెరీర్ లో కొన్ని బ్లాక్ బాస్టర్ సినిమాల స్టోరీలను రిజెక్ట్ చేసి అదే దర్శకుడి దర్శకత్వంలో ఒక ప్లాప్ మూవీ లో నటించాడు. అసలు మహేష్ దగ్గరికి బ్లాక్ బస్టర్ స్టోరీ ని తీసుకువచ్చిన దర్శకుడు ఎవరు..? ఆ మూవీ కథను ఎందుకు వద్దన్నాడు..? ఆ తర్వాత అదే దర్శకుడితో ఏ ఫ్లాప్ మూవీ లో నటించాడు అనే వివరాలను తెలుసుకుందాం. తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఏ ఆర్ మురగదాస్ ఒకరు.

ఈయన చాలా సంవత్సరాల క్రితం సూర్య హీరోగా ఆసిన్ , నయనతార హీరోయిన్లుగా గజిని అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కథ రాసుకున్న తర్వాత మురుగదాస్మూవీ కథను సూపర్ స్టార్ మహేష్ బాబు.కు వినిపించాడట. ఈ కథ మొత్తం విన్న మహేష్ బాబు ఈ సినిమా కథ సూపర్ గా ఉంది. ఈ కథతో సినిమా తీస్తే అద్భుతమైన విజయం సాధిస్తుంది. కాకపోతే ఈ మూవీ నాపై వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఈ మూవీ చేయను అని చెప్పాడట.

ఆ తర్వాత ఈ మూవీ ని సూర్య తో తెరకెక్కించిన మురుగదాస్మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత మురుగదాస్ కొన్ని సంవత్సరాలకు మహేష్ బాబు కి స్పైడర్ అనే మూవీ కథను వినిపించాడు. ఇక స్పైడర్ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో మహేష్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అలా మురగదాస్ "గజినీ" లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ కథ చెప్పినప్పుడు రిజెక్ట్ చేసిన మహేష్ "స్పైడర్" మూవీ చేసి అపజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: