టాలీవుడ్ క్వీన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళంలో కూడా  దాదాపు  అందరూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిందీ ఈ బ్యూటి. ఇకపోతే ఆరోగ్య విషయంలో, పెళ్లి విషయంలో ఎన్నో కష్టాలు ఎదురైనా తట్టుకొని నిలబడింది. అయినా కూడా తన సినిమా ప్రయణాన్ని ఏ మాత్రం ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే మయోసైటిస్‌ అనే  వ్యాధి కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే సమంత బాలీవుడ్‌ కింగ్‌ షారూక్‌ఖాన్‌తో కలిసి ఒక సినిమా, మలయాళంలో మమ్ముట్టి సరసన

 ఒక చిత్రం, తమిళంలో విజయ్‌కు జంటగా ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే సమంత నటించి వెబ్‌ సిరీస్ సిటాడెల్ సైతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు సమంత. ఇక తను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....నేను ఒక సాధారణ కుంటుంబంలో పుట్టిన అమ్మాయిని. నాకు  ఉన్నత చదువుకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో మా నాన్న  ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే నాకు మరో మార్గం లేక నేను సినిమాల్లో రావాల్సి వచ్చింది. ఇక  ఒకానొక సమయంలో కేవలం రూ. 500 కోసం

 హోటల్‌లో హోస్ట్‌గా కూడా పనిచేశాను. ఒక సాధారణ అమ్మాయిగా జీవితం ప్రారంభించిన నేను సినిమా ద్వారా లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నానని ఆమె చెప్పింది. సినిమా తనకు స్వేచ్ఛ, గుర్తింపు, మరియు అనేక అవకాశాలను ఇచ్చిందని ఆమె తెలిపింది. ఇంకా చాలా సాధించాలని, ప్రేక్షకులను అలరించాలని ఆమె ఆశ పడుతుంది.  ఇక సమంత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు ఆమె మాటలకు ఫిదా అవుతున్నారు. ఆమె నిజాయితీ, ధైర్యం, మరియు ప్రతిభకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: