ఇక విడిపోయిన తర్వాత ఎవరికి వారు తమ కెరియర్ లో బిజీగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకొని వార్తల్లో నిలిచారు. త్వరలోనే వీరి వివాహం కూడా జరగబోతుంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే శోభిత నాగచైతన్య మూడేళ్లకే విడిపోతారంటూ సంచలన కామెంట్లు చేశారు. తాజాగా వీరిద్దరి జాతకాలు కూడా చూశానని, వీరిద్దరి జాతకాలు అంతగా బాగాలేవని, ముఖ్యంగా శోభిత జాతకంలో శని కూర్చున్నాడు అని ఆమె కెరియర్ కూడా ఏమంత బాగోలేదంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాదు నాగచైతన్య , శోభిత ఒక స్త్రీ కారణంగా విడిపోతారని, 2027 వరకు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారని , అయితే ఆ తర్వాతే ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతారంటూ సంచలన కామెంట్లు చేశారు వేణు స్వామి. ఇక ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు ఈయన చెప్పింది చూస్తూ ఉంటే నాగచైతన్యకు పెళ్లి కలిసి రావడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా నాగచైతన్యకి తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే పెళ్లి కలిసి రావడంలేదని చెప్పవచ్చు. మరి చూద్దాం వేణు స్వామి చెప్పింది ఈసారి నిజమవుతుందో లేదో.. ఏది ఏమైనా సమంతాను దూరం చేసుకున్న నాగచైతన్య శోభిత ప్రేమలో పడి ఇప్పుడు ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. మరి వైవాహిక జీవితంలోనైనా సంతోషంగా ఉంటారేమో చూడాలి.