తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి నిహారిక కొణిదెల, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే సుహాస్,చాందినీ చౌజరి జంటగా సందీప్ రాజ్ తెరకెక్కించిన కలర్ ఫోటో సినిమాకి జాతీయ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ సినిమాకి కమర్శియల్ గా విజయం సాధించలేకపోయినా నేషనల్ అవార్డు రావడంతో ఫేమస్ అయింది. కాగా "కలర్ ఫోటో" టీమ్ ని టాలీవుడ్ పెద్దలు సత్కరించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ సినిమా లో ఛాన్స్ ఇస్తే గనుక మెగా డాటర్ నిహారిక వదులుకునేదాన్ని కాదని తాజాగా ఓ

 ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక తను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...నటిగా నేనెప్పుడు కథలకే ప్రాధాన్యత ఇస్తాను. చిన్న పాత్ర, చిన్న హీరో అనే ది ఉండదు. కాకపోతే కొంత మంది దర్శకులు నేను నాయికా ప్రాధాన్యమున్న కథలే చేస్తానని, చిన్న హీరోల సరసన నటించనని అనుకుంటున్నారు.  అనుమానంతోనే చాలా మంది చిన్న దర్శకలు నాకు కథలు వినిపించడం లేదు. అప్పట్లో సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాకి నన్ను అనుకున్నారుట. కానీ సుహాస్ లాంటి చిన్న నటుడి సరసన చేస్తానా? లేదా? అన్న ఉద్దేశంతో తీసుకోలేదుట. అసలు ఆ కథ నావరకూ వస్తే చేస్తానా? లేదా? అన్నది తెలుస్తుంది.

 అందుకే ప్రస్తుతానికి తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టా. అక్కడైతే ఆ ప్రభావం ఉండదు కదా` అని తెలిపింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది  ఇలా ఉంటే నిహారిక కొణిదెల  నిర్మించిన తాజా చిత్రం కమిటీ కుర్రోళ్ళు తెలుగు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. 11 మంది హీరోలు, 4 హీరోయిన్లతో తెరకెక్కిన ఈ చిత్రం కాలేజీ లైఫ్‌ను తెరపై ఆవిష్కరించింది. ప్రేమ, స్నేహం, కామెడీ అన్నీ ఈ చిత్రంలో కలగలిసిపోయాయి. ముఖ్యంగా కొత్త తరం నటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. నిహారిక కొణిదెల నిర్మాతగా తన మొదటి చిత్రంతోనే మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: