నందమూరి నటసింహం బాలకృష్ణ ,నాగార్జున ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. కుర్ర హీరోలతో పోటీపడుతూ.. సినిమాలు చేస్తూ భారీ హిట్స్ అందుకుంటున్నారు. బాలకృష్ణ వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తో హిట్స్ అందుకున్నారు. అలాగే నాగార్జున కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే నాగార్జున, బాలకృష్ణ మధ్య అంతా సరిగ్గా లేదని ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఈ వార్తల్లో వాస్తవమేంతా అన్నది తెలియదు కానీ ఈ ఇద్దరి మధ్య గ్యాప్ గురించి ఎదో ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది.? అసలు ఇది నిజమేనా .? అన్నది కూడా ప్రశ్నే..బాలకృష్ణ తన తోటి హీరోల తో కలుస్తూనే ఉంటారు. చిరంజీవి బాలయ్య కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే వెంకటేష్ కూడా ఎవరి తోనూ గొడవలు పెట్టుకున్న దాఖలాలు లేవు. అయితే నాగ్, బాలయ్య మధ్య ఎదో గొడవ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఓ కార్యక్రమం లో పాల్గొన్న బాలయ్య అక్కినేని, తొక్కనేని అంటూ నోటి దురుసుతో వ్యాఖ్యానించారు. దీనిపై అక్కినేని అభిమానులు బాలకృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు నాగచైతన్య పరోక్షంగా కౌంటర్ కూడా ఇచ్చాడు.ఇదిలా ఉంటే గతం లో నాగచైతన్య కథానాయకుడి గా పరిచయం అవుతున్న జోష్ చిత్రం ఆడియో ఫంక్షన్ కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు తనకు బాబాయ్ అవుతారని, నాగార్జున లో అన్నీ నాగేశ్వరరావు పోలికలే ఉన్నాయని నాగ్ పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తుంటారని వ్యాఖ్యానించారు.ఆ మాటలకే నాగార్జున తీవ్రంగా బాధపడ్డాడని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.దీనితో బాలయ్య, నాగార్జున మధ్య దూరం పెరిగిందని సమాచారం.