సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు, అభిమానులు , రాజకీయ వేత్తలు ఇలా అంత కూడా మహేష్ బాబు కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ అందజేస్తూ తమ అభిమానాన్ని , ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ ను అందజేశారు.ఘట్టమనేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అగ్ర హీరో దివంగత కృష్ణ కుమారుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. 8 చిత్రాలకు పైగా బాలనటుడిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు. ఫస్ట్ ప్రిన్స్ నటించిన రాజకుమారుడు మూవీకి ఏకంగా ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా నిజం చిత్రానికి కూడా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకోవడం విశేషం.తర్వాత ‘‘అర్జున్, ఒక్కడు, టక్కరి దొంగ, మురారి, పోకిరి, అతిథి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం’’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్టు‌లో నటిస్తున్నారు.

ఈ చిత్రం కోసం సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రిన్స్‌కు విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు ఉన్నాయట. జూబ్లీహిల్స్ లో ఉన్న ఓ భవనం ధర ఏకంగా రూ. 30 కోట్లు ఉంటుందట. సూపర్ స్టార్ ఆస్తుల విలువ 250-330 కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం సూపర్ మహేష్ బాబు ఆస్తుల వివరాలు విన్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.అలాగే నేడు ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా మురారి సినిమా రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఎగబడి మరీ థియేటర్ల వద్ద బారులు తీరారు. హైదరాబాదులో మల్లికార్జున థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఏకంగా మహిళలైతే అక్కడే డాన్స్ వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తన విషేస్  లో మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా పేర్కొన్నారు. "హ్యావ్ ఎ బెస్ట్ ఇయర్" అంటూ విష్ చేశారు. కాగా ఇప్పటికే పలువురు స్టార్లు మహేష్ కి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్, 14 రిల్స్,సురేష్ ప్రొడక్షన్స్ తదితర అగ్ర నిర్మాణ సంస్థలు, ఎన్టీఆర్, అనిల్ రావిపూడి,వంశి పైడిపల్లి తదితర ప్రముఖులు విష్ చేసిన వారిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: