టాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న హెయిర్ అలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు స్థానంలో ఉంటారు ‌. నట శేఖర్ కృష్ణ తనయుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ ప్రెసెంట్ టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు . ఇక నేడు అనగా ఆగస్టు 9వ తారీఖున మహేష్ పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆయన కెరీర్లో సాధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మహేష్ బాబు 1975 ఆగస్టు 9న మద్రాస్ లో జన్మించాడు . తన నాలుగో ఏటా దాసరి నారాయణరావు డైరెక్షన్లో వచ్చిన నీడ చిత్రంలో బాల నటుడిగా నటించి వెండితెరకు పరిచయం అయ్యాడు .


ఇక ఆ తరువాత కృష్ణతో పలు చిత్రాల్లో నటించాడు . రాజకుమారుడు చిత్రంతో మహేష్ బాబు సోలో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు . అంతేకాకుండా తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు కూడా .  నటనతో పాటే ఇతర రంగాల్లోనూ అందరికంటే ముందున్నాడు. మహేష్ బాబు . ఆయన కేవలం సినిమాలు మాత్రమే కాదు .. యాడ్స్ చేయడంలో కూడా ముందుంటారు . సినిమాల తో పాటు మరోవైపు నిర్మాణ వ్యాపారాలతో పాటు ఇతర వ్యాపారాలలో ఫుల్ బిజీగా ఉంటారు .


ఇక మహేష్ కేవలం 27 సినిమాలకే 8 నంది అవార్డులు అందుకున్నాడు . రాజకుమారుడు తో తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డుని అందుకున్న మహేష్ అనంతరం నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్ చిత్రాల ద్వారా కూడా నంది అవార్డులను సంపాదించుకున్నాడు . అలా ఏ హీరో కూడా సాధించలేని గొప్ప రికార్డును మహేష్ తన సొంతం చేసుకున్నాడు . ఇక ప్రస్తుతం మహేష్ బాబు జక్కన్న తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: