ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన శోభిత భాషతో సంబంధం లేకుండా వలసగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది . ఇక ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యతో ప్రేమలో పడి త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది . ఈ క్రమంలో శోబితాకు సంబంధించిన పలు విషయాలను నెటిజెన్లు సెర్చ్ చేస్తున్నారు . శోభిత మే 31న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది . తల్లి పేరు శాంత కామాక్షి తండ్రి పేరు వేణు గోపాల్ రావు . తండ్రి ఇంజనీరింగ్ కాగా తల్లి ఉపాధ్యాయురాలు . శోభిత చిన్నతనంలోనే వీరు వైజాగ్ కు షిఫ్ట్ అయ్యారు .
ఆమె విశాఖపట్నంలోని లిటిల్ ఏజెంట్స్ పాఠశాలలో చదివింది . ఇక ఈ బ్యూటీ చిన్నప్పటి నుంచే చదువులో అందరికంటే ముందుండేదట . డాక్టర్ అవ్వాలనే కోరిక కూడా ఉందట . ఇక పోతే ప్రస్తుతం అక్కినేని ఇంట కోడలి కాబోతున్న మరి శోభిత ఏ కాస్ట్ అంటూ ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు . ఇంట్లో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చే శోభిత ది అచ్చమైన బ్రాహ్మణ కులం కావడం విశేషం . కాగా చైతు అండ్ శోభిత ది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ . ఇక నాగచైతన్య క్యాస్ట్ కమ్మ అని మనందరికీ తెలిసిందే . ప్రెసెంట్ వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి .