టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా ఉంటోంది. వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో సెటిల్ అయిన ఈ భామ అక్కడ మంచి క్రేజ్‌ను తెచ్చుకుందని చెప్పాలి. ఏడాది క్రితం బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్‌తో డంకీ మూవీలో నటించి హిట్ కొట్టింది. ఈ మధ్యనే తాను ప్రేమించిన వ్యక్తితో మూడుముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన భర్త గురించి చెబుతూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. బ్యాడ్మింటన్ కోచ్ అయిన తన భర్త మథియాస్ బో తానే తొలిసారి తనను ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

మొదటిసారి తన భర్త ప్రపోజ్ చేసినప్పుడు అనేక డౌట్స్ వచ్చాయని, ఫస్ట్ డేట్ సమయంలో కూడా ఫ్రెండ్స్ అంతా లేనిపోని డౌట్స్‌తో తనను భయపెట్టారని చెప్పింది. 11 ఏళ్ల క్రితం తొలిసారి తామిద్దరం కలిశామని, అప్పుడే ప్రేమ పుట్టినట్లు చెప్పుకొచ్చింది. ఒకరిపై మరొకరు నమ్మకం పెంచుకుని తొమ్మిదేళ్ల పాటు కలిసి బతికామని, ఆ తర్వాత జీవితాంతం కలిసుంటామనే నమ్మకం పెరగడంతో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ప్రేమించిన మొదట్లో తన భర్తపై అనేక సందేహాలు ఉండేవని, ఆ తర్వాత అవన్నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేని చెప్పింది.

తాప్సీని తన భర్త ఫస్ట్ డేట్ కోసం దుబాయ్ వెళ్దామని చెప్పాడట. అదే విషయాన్ని తన ఫ్రెండ్స్‌కు చెప్పగా వారంతా లేనిపోని విషయాలు చెప్పి భయపెట్టేశారట. దుబాయ్‌లో ఎవరికైనా అమ్మేసినా అమ్మేయొచ్చేమో అని తన ఫ్రెండ్స్ కంగారు పెట్టారట. ఓ ఫ్రెండ్ అయితే ఏకంగా దుబాయ్ లో ఉన్న తన అక్క నంబర్ ఇచ్చి మరీ జాగ్రత్త చెప్పిందట. మొత్తానికి తాప్సీ తన ఫ్రెండ్స్ చేసిన పనికి కొంత వరకూ ఇబ్బంది పడినట్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాప్సీ ఫిర్ ఆయీ హసీనా దిల్ రుబా, ఖేల్ ఖేల్ మే అనే చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమా ఈ నెలలోనే విడుదల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: