సౌత్ ఇండియాలో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానాన్ని ఈ ముద్దుగుమ్మ సంపాదించుకుంది. అయితే తన సినీ కెరీర్‌ మొదట్లో ఆమె సినిమాలు ఫ్లాప్ అవుతాయనే టాక్ ఉండేది. కెరీర్ ప్రారంభంలో కీర్తి ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈమధ్యనే ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న కీర్తి సురేష్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. అలాగే తన పెళ్లి గురించి వస్తోన్న రూమర్స్‌పై కూడా మహానటి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. కెరీర్ మొదట్లో తన సినిమాలు పరాజయం అవ్వడంతో మానసికంగా కుమిలిపోయానని చెప్పింది.

తన మనసుకు నచ్చిన మూవీస్‌లో నటిస్తున్నప్పటికీ కీర్తి సురేష్ సినిమాలు ఫ్లాప్ అయ్యేవట. దానివల్ల ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయట. మహానటి మూవీ చేసిన తర్వాత ఆ ట్రోల్స్ అన్నీ తగ్గాయట. విమర్శలు వచ్చినప్పటికీ వాటి నుంచి అనేక విషయాలను నేర్చుకున్నానని పాడ్ కాస్ట్‌లో కీర్తి చెప్పుకొచ్చింది. తనపై చాలా మంది ఇప్పటికీ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని, అయితే వాటిని అంతగా పట్టించుకోనని కొట్టిపారేసింది. కాలం చాలా పవర్ ఫుల్ అని, ఆ కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని తెలిపింది.  

ఇకపోతే హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ కొట్టిపారేస్తూ కీర్తి ఓ క్లారిటీ ఇచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవించుకుంటూ లైఫ్ స్టార్ చేయడమే పెళ్లి అని చెబుతూనే తాను  సింగిల్ కాదని కుండబద్దలుకొట్టేసింది. సింగిల్‌గా ఉండటం బోర్‌గా అనిపించడం లేదా అని ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు కీర్తి బదులిచ్చింది. తాను ప్రస్తుతం సింగిల్‌గా లేనని క్లారిటీ ఇచ్చింది. దీంతో కీర్తి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొందరేమో కీర్తికి కాబోయే భర్త ఎవరంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు. మొత్తానికి మహానటి మూడ్ మారిపోయిందని, ఇక సింగిల్స్ అందరూ సైడైపోవాల్సిందేనని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: