కోలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎప్పుడూ కూడా చాలా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు. ప్రస్తుతం డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. సూర్య బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ఇవ్వడం జరిగింది చిత్ర బృందం. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించబోతున్నారు. సూర్య మరొక సారి గ్యాంగ్ స్టర్ గా కూడా కనిపించబోతున్నారట.


సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సమయంలో సడన్గా ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే ఈ సినిమా షూటింగ్లో సూర్య తలకు గాయమైనట్లుగా కోలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ విషయం విన్న అభిమానులు ఆందోళన తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం పైన నిర్మాత రాజశేఖర్ పాండియన్ మాట్లాడుతూ సూర్య కు స్వల్పంగా గాయమైందని ఇప్పటికే సూర్య కోలుకున్నారు..అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దండి అంటూ తెలియజేశారు. దీంతో సూర్య అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు..



ప్రేమ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సన్నివేశంలో భాగంగా ఊటీలో షూటింగ్ చేస్తూ ఉండగా అక్కడ ప్రమాదం జరిగిందని వెంటనే సూర్యను ఆసుపత్రికి తీసుకువెళ్లి మరి దగ్గరుండి చికిత్స చేయించామంటూ తెలిపారు. ఇందులో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తూ ఉన్నది. అలాగే అత్యధిక భాషలలో నటిస్తున్న కంగువా సినిమా షూటింగ్ కూడా పూర్తి కాబోతోంది.త్వరలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా అయింది. అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రెండు అయిపోగానే డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నారట సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి: