మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ చిత్రం గురించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులైనప్పటికీ. హీరో, దర్శకుల కమిట్ మెంట్స్ పూర్తి చేసే క్రమంలో సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి మరింతగా ఆలస్యమవుతోంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం “దేవర” పూర్తయిన తర్వాత, ఎన్టీఆర్31 షూటింగ్ ప్రారంభమవుతుందని గతంలోనే ప్రకటించారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను, సూపర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోయే యాక్షన్ మూవీలో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇటీవలే “సలార్” సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్31 గురించి మాట్లాడాడు. ఇంకా సినిమా గురించి మరిన్ని వివరాలు చెప్పాడు. ఇది పూర్తిగా భిన్నమైన కథ, భిన్నమైన భావోద్వేగాలు కలిగించే చిత్రం అని ఆయన పేర్కొన్నాడు. ఇది ఏ జానర్లోకి వస్తుందో చెప్పడానికి ఇష్టపడటం లేదు, కానీ చాలా మంది ఇది యాక్షన్ చిత్రమే అనుకుంటారు. ఇది నాకు కొత్త కథ, దీన్ని నా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను. దానికంటూ ఓ ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది, ప్రజలు దానితో తప్పకుండా కనెక్ట్ అవుతారు” అని ఆయన చెప్పాడు. నేపథ్యం లో ఈ సినిమా కథ గురించి ఆసక్తికరం గా మారింది. అదేమిటంటే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ‘NTR31’ మూవీ స్టోరీ ఇదేనంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌, క్యాప్షన్ ఆధారంగా 1969లో మహారాష్ట్ర తారాపూర్‌లో ప్రారంభమైన తొలి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం చుట్టూ కథ నడుస్తుందంటున్నారు. అందులో ntr కార్మికుడిగా పనిచేస్తారేమోనంటూ ఊహించుకుంటున్నారు. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.అయితే మారిన పరిస్థితులు అనూహ్యమైన అవాంతరాల కారణంగా గత కొన్ని సినిమాలని చెప్పిన డేట్ కి రిలీజ్ చేయలేని పరిస్థితి. అయితే ఇప్పుడీ ట్రెండ్ ని ప్రశాంత్ నీల్ కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ వేడుక జరిగింది. ముహూర్తం రోజే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 2026 జనవరి 9న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లినట్లు అనౌన్స్ చేశారు. అంటే 2026 సంక్రాంతి బరిలోకి ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్లే. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో వుంది. అయితే టైటిల్ ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: