స్టార్ సినిమాల రీ రిలీజ్ టైం లో ఏదో ఒక సెన్సేషన్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా నేడు సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా మురారి రీ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా అన్ని చోట్లా సినిమాకు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మురారి రీ రిలీజ్ అయిన ప్రతి థియేటర్ దగ్గర మహేష్ ఫ్యాన్స్ హడావుడి ఒక రేంజ్ లో ఉంది. ఐతే విజయవాడ ఫ్యాన్స్ మాత్రం దానికి మించి చేశారు. మొత్తం తెలుగు రెండు రాష్ట్రాలు మొత్తం విజయవాడ వైపు చూసేలా చేశారు.

విజయవాడ అలంకార్ థియేటర్ లో మురారి రీ రిలీజ్ కాగా షో వేయడానికి ముందే అక్కడ ఫ్యాన్స్ బారులు తీరి నానా హడావిడి చేశారు. ఇక సినిమా ఆడుతున్న టైం లో అలనాటి రామచంద్రుడి సాంగ్ వస్తున్న టైం లో థియేటర్ లో ఒక ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. మహేష్ ఫ్యాన్స్ దగ్గర ఉండి ఈ పెళ్లి చేశారు. తెర మీద మహేష్, సోనాలి జంట థియేటర్ లో మహేష్ ఫ్యాన్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా అంతా వైరల్ గా మారింది.

మహేష్ బర్త్ డే కన్నా అలంకార్ థియేటర్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట వీడియో వైరల్ గా మారింది. ఐతే ఇంత కష్టపడి థియేటర్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట కు మహేష్ ఆశీర్వాదం ఉంటుందా. మహేష్ టీం వీళ్లని కలుస్తారా.. మహేష్ ఆశీర్వాదం వీళ్లకు లభిస్తుందా వీళ్లు ఈ పెళ్లిని ఇలా వైరల్ అవుతుందనే చేసుకున్నారా లేదా అలా జరిగిపోయిందా వీటన్నిటికీ సమాధానం రావాల్సి ఉంది. మరి మహేష్ బర్త్ డే హంగామా అంతా వీళ్ల థియేటర్ పెళ్లి వల్ల మరింత వైరల్ అయ్యింది. ఇక హైదరాబాద్ మల్లిఖార్జున థియేటర్ లో కూడా మహేష్ లేడీ ఫ్యాన్స్ కూడా ఒక రేంజ్ లో డాన్స్ లు వేస్తూ అదరగొట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: