అదేంటో స్టార్ సినిమాల రీ రిలీజ్ లు కేవలం ఫ్యాన్స్ కు ఏదో సరదాగా ఎంటర్టైన్ కోసమే అనేసుకుంటే పొరబడినట్టే. లేటెస్ట్ గా మురారి సినిమా వల్ల ఆ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ మళ్లీ జోష్ నింపుకున్నారు. తను డైరెక్ట్ చేసిన 20 ఏళ్ల క్రితం సినిమా రీ రిలీజ్ కు ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూసి ఆయన ఖుషి అవుతున్నారు. సినిమా రిలీజ్ కు వారం ముందు వరకు కృష్ణవంశీ ప్రతి మహేష్ అభిమానికి.. తన అభిమానికి ఓపికగా సోషల్ మీడియాలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మురారి రీ రిలీజ్ కు ఈ మాత్రం క్రేజ్ రావడానికి వారం ముందు దాకా కృష్ణవంశీ ఇచ్చిన బూస్టప్ బాగా పనిచేసింది. ఇక సినిమా రీ రిలీజ్ టైం లో ఆ సినిమాలో నటించిన యాక్టర్స్ తో స్పెషల్ బైట్ కూడా ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసింది. సోనాలి, రవి బాబు, శివాజి రాజా, చిన్నా, అనితా చౌదరి ఇలా మురారితో సంబంధం ఉన్న వారంతా అందుబాటులో ఉన్న వారంతా బైట్ లు ఇచ్చారు. దాని వల్ల సినిమా కు మరింత క్రేజ్ ఏర్పడింది.

ఐతే రిలీజ్ రోజు సోనాలి సోషల్ మీడియా లో కూడా ఆ సినిమా షూటింగ్ అంతా చాలా సరదాగా సాగిందని. మహేష్ తో కలిసి పని చేయడం మంచి ఎక్స్ పీరియన్స్ అని చెప్పింది. సోనాలి లైన్ లోకి వచ్చాక అమ్మడు మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. వెంటనే త్రివిక్రం సోనాలిని కూడా తీసుకొచ్చెయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్స్ అందరినీ తన సినిమాల్లో పెడుతూ క్రేజ్ తెచ్చే గురూజీ సోనాలి ని కూడా ఏదైనా సినిమాలో రీ ఎంట్రీ ఇప్పిస్తే ఆమె తెలుగు ఫ్యాన్స్ కచ్చితంగా సంతోష పడతారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: