కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకొని సూపర్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించిన వారిలో సుమంత్ ఒకరు. ఇక కెరియర్ ప్రారంభంలో గౌరీ , సత్యం , గోదావరి లాంటి విజయవంతమైన సినిమాలతో మంచి స్థాయికి ఎదిగిన ఈ హీరో తన కెరీర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు. అలా సుమంత్ మిస్ చేసుకున్న ఒక బ్లాక్ బస్టర్ మూవీ గురించి తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం తరుణ్ హీరో గా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నువ్వే కావాలి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.

మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను కూడా అందుకుంది. ఇక ఈ మూవీ ద్వారా తరుణ్ క్రేజ్ అద్భుతమైన స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమలో పెరిగింది. ఈ మూవీ తర్వాత తరుణ్ కు తెలుగు లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు కూడా రావడం జరిగింది. ఇకపోతే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత గొప్ప విజయం సాధించిన నువ్వే కావాలి సినిమాలో హీరోగా మొదటి ఆప్షన్ తరుణ్ కాదట. ఈ మూవీ దర్శకుడు అయినటువంటి విజయ్ భాస్కర్ ఈ సినిమాలో మొదటగా హీరో పాత్రకు సుమంత్ ను అనుకున్నాడట.

అందులో భాగంగా ఆయనకు ఈ సినిమా కథను కూడా వివరించాడట. కాకపోతే సుమంత్ అప్పటికే అనేక సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా కథ బాగున్న చేయడం కుదరదు అని చెప్పాడట. దానితో తరుణ్ ను ఈ మూవీ లో హీరోగా సెలెక్ట్ చేసుకోగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇకపోతే చాలా మంది సుమంత్ కనుక ఆ సమయంలో ఈ మూవీ చేసి ఉంటే ఆయన కెరియర్ ఇప్పుడు మరోలా ఉండేది అని అభిప్రాయ పడుతున్నారు. సుమంత్ కి ఈ మధ్య కాలంలో మాత్రం మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: