టాలీవుడ్ దర్శకుడు వైవిఎస్ చౌదరి తీసింది కొన్ని సినిమాలే అయినా.. వాటిలో కొన్ని గుర్తిండిపోయే చిత్రాలు తెరకెక్కించారు. ఎడిటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ దర్శకుడు.. రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా కూడా ఇండస్ట్రీలో సేవలు అందించారు.వైవిఎస్ చౌదరి దర్శకుడిగా తన రెండో సినిమాని మహేష్ బాబుతో చేశారు. 2000వ సంవత్సరంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘యువరాజు’ మూవీ వీరిద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రమే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. అయితే యువరాజు షూటింగ్ సమయంలో..ఈ ఏడాది ఆరంభంలో 'గుంటూరుకారం'తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు మహేశ్‌. ప్రస్తుతం ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం సన్నద్ధమవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. మహేశ్‌ 29వ చిత్రమిది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'మహారాజ్‌'  అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్‌. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపించనున్నారు.ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని టాలీవుడ్ దర్శకుడు వైవీఎస్ చౌదరి.. చాన్నాళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకున్నారు. నందమూరి హరికృష్ణ కొడుకు జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్‌ అనే కుర్రాడ్ని హీరోగా పరిచయం చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.ఈ నేపథ్యంలో వైవిఎస్ చౌదరి మహేష్ బాబు యువరాజు మూవీ గురించి కొన్ని ప్రత్యేక కామెంట్లు చేశారు. బాల నటుడిగా ఉన్నప్పుడే మహేష్ బాబు సూపర్ స్టార్ అవుతారని ఊహించినట్లు దర్శకుడు వైవిఎస్ చౌదరి తెలిపారు. ఆయనతో యువరాజు సినిమా చేయడం తన అదృష్టమని మీడియాతో చెప్పారు. కావాలని ఆయనను రిక్వెస్ట్ చేసి సినిమాలో శ్రీకృష్ణుడి గెట్ అప్ వేయించినట్లు పేర్కొన్నారు ఆయనకు ఆ పాత్ర చక్కగా సరిపోతుందన్నారు. మహేష్ తనయుడు గౌతమ్ ని పరిచయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: