టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఓ సినిమా విడుదల కాకముందే ఆయన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోదు అని చెప్పాడట. కానీ ఎవరు వినలేదట. ఆ సినిమా ఏది ..? ఆ తర్వాత దానికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... వేణు శ్రీరామ్ నా దగ్గరికి ఓ మై ఫ్రెండ్ అనే మూవీ కథతో వచ్చాడు. ఆ కథ మొత్తం విన్నాక నాకు బాగా నచ్చింది. ఇక ఆయనతో కొంత కాలం పాటు ట్రావెల్ చేసి ఈ సినిమాను మొదలు పెట్టాను.

సినిమా వేణు శ్రీరామ్ కి మొదటి సినిమా. ఈ మూవీ లో సిద్ధార్థ్ , హన్సిక , శృతి హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు. సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. సినిమా నేను చూశాను. నాకు బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్ సినిమా షూటింగ్ మొత్తం అయ్యింది. ఆ తర్వాత నేను సినిమా చూశాను. నాకు పెద్దగా నచ్చలేదు. ఆ తర్వాత కామెడీ ట్రాక్ అవి ఇవి చేర్చి కొంచెం బెటర్మెంట్ చేసాం. కాకపోతే సినిమా ఆడదు అని నాకు అనిపించింది. అదే విషయాన్ని శిరీష్ , లక్ష్మణ్ కు చెప్పాను. వారికి మాత్రం సినిమా బాగా నచ్చింది , ఆడుతుంది అని నమ్మకంతో వారు ఉన్నారు. ఇక సినిమా విడుదల అయింది.

మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ ఆ తర్వాత రోజు నుండి కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. రెండవ రోజు నుండి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి అంటే సినిమా పోయింది అని అర్థం. చివరగా రిజల్ట్ అలాగే వచ్చింది. ఆ తర్వాత వేణు శ్రీరామ్ కు నేను చెప్పాను. నువ్వు సినిమా బాగానే తీశావు. కాకపోతే ఈ సినిమా కొంత మంది కి మాత్రమే కనెక్ట్ అయ్యింది. ఎక్కువ శాతం మందికి కనెక్ట్ కాలేదు. అందుకే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మళ్ళీ మనం ఒక మంచి కథతో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేద్దాం అని చెప్పినట్లు తాజా ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

dr