ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజం చేస్తూ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌పైజ్ ఇచ్చారు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్. శుక్రవారం ‘NTR 31’ చిత్రం పూజకార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ట్స్‌ సంస్థల నిర్మాణంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌, నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజులు నిర్మిస్తున్న ఈ సినిమాను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సహా పలువురు హాజరయ్యారు. తార‌క్ భార్య లక్ష్మీ ప్రణతి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఇక ఈ మూవీ జ‌న‌వ‌రి 09 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రక‌టించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు నటిస్తోన్న సినిమా ‘దేవర’. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొమురం భీమ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు తారక్. దీంతో ఇప్పుడు దేవర సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు గతంలో డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించారు.

చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. వచ్చిన రెండు పాటలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇవి భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో మొదటి భాగం ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కు తీసుకొస్తున్నారు. అయితే మరి పార్ట్ 2 విడుదల ఎప్పుడు అనేది ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఈ సినిమా సీక్వెల్ ని పెద్దగా లేట్ చేయకుండా 2025 లోనే తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. దీనితో ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు తారక్ ఎక్కువ సమయం తీసుకునేలా లేరనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం బాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం నటిస్తున్న 'దేవర' చిత్రం సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' రిలీజై దాదాపు రెండున్నర ఏళ్లు కావొస్తోంది. ఈ గ్యాప్లో ఆయన నుంచి మరే సినిమా కూడా రాలేదు. దీంతో అభిమానులకు ఎన్టీఆర్ బాగా బాకీ పడిపోయారు. అయితే ఈ లోటును భర్తీ చేసేందుకు ఆయన కసిగా కష్టపడుతున్నారు. ఫ్యాన్స్కు ఫుల్మీల్స్ పెట్టేందుకు ఈ నందమూరి హీరో రెడీ అవుతున్నారు. 15 నెలల్లో మూడు సినిమాలు ప్రేక్షకుల కోసం తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: