ఇప్పుడు రెండవసారి కూడా రీ రిలీజ్ లో మురారి సినిమా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్గా రీ రిలీజ్ చేయగా ఈ సినిమా బుకింగ్స్ తోనే సాలిడ్ రెస్పాన్స్ని అందుకున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు రన్ టైం ను పూర్తి చేసుకున్న సమయానికి సుమారుగా 5.4 కోట్ల రూపాయల కలెక్షన్స్ని సైతం రాబట్టినట్లు తెలుస్తోంది నైజాం ప్రాంతంలో మాత్రం ఏకంగా 2.9 కోట్ల రూపాయలు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఇంతటి అత్యధిక కలెక్షన్స్ రాబట్టినట్లుగా లేదట.
ఇలా క్లాసికల్ చిత్రంతో ఆల్ టైం రికార్డును సృష్టించారు మహేష్ బాబు.. మొత్తానికి మురారి సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటికీ ఎన్నో ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్లు కానీ జరిగాయి అంటే మురారి సినిమాలోని పాట ఖచ్చితంగా ఉండాల్సిందే అనేంతగా మారిపోయింది.. థియేటర్ల వద్ద కూడా అభిమానులు నాన్న హంగామా చేయడమే కాకుండా కొంతమంది థియేటర్ లోపలి వివాహాలు చేసుకున్న సందర్భాలు కూడా నిన్నటి రోజున చాలానే వైరల్ గా మారాయి. మరి మొత్తం మీద కలెక్షన్స్ ఎంత రాబట్టింది అనే విషయం పైన నిర్మాత క్లారిటీ ఇస్తారేమో చూడాలి.