శ్రీలీల తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఈమె టాలీవుడ్ యంగ్ సెన్సేషన్. అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా తనను తాను నిరూపించుకుంది. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ తన క్యూట్ యాక్టింగ్తో మనసు దోచింది. ముఖ్యంగా తన ఎనర్జిటిక్ డ్యాన్స్తో ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దుగుమ్మ శ్రీలీల. అయితే ఈ చిత్రం టాక్ పరంగా డివైడ్ రెస్పాన్స్ను అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించి ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మరిన్ని సినిమాలు చేస్తోంది. అలానే స్టార్ హీరోయిన్గా ఎదగడానికి తనకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఏ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా.. అందులో హీరోయిన్ గా శ్రీలీల పేరే వినిపిస్తోంది. యంగ్ హీరోల నుంచి స్టార్ కథానాయకుల వరకు అందరూ ఈమెతోనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రంగు రంగుల ఊహా ప్రపంచం కదా.. ఏదైనా జరగొచ్చు. దశ తిరిగితే ఒకరు ఓవర్ నైట్ స్టార్ అవొచ్చు. ఇంకొకరు అవశాలు దొరక్క పరాజయాలను ఎదుర్కొంటూ వాషౌట్ అయిపోవచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు, స్వాగతించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

దమాకా, స్కంద, గుంటూరు కారం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి వరుసగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం రాబిన్‌ హుడ్‌, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉందీ చిన్నది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న శ్రీలీల తనను మాత్రం.. స్టార్ హీరోయిన్ అని పిలవకండని చెబుతోంది. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని ఉందని కానీ, ఇప్పుడే తనను అలా పిలవడం నచ్చదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నా ఇప్పటికీ స్టార్ అని పిలిపించుకోవడానికి తనకింకా ఆ అర్హత రాలేదని చెప్పుకొచ్చింది. ఈ విషయమై శ్రీలీలా మాట్లాడుతూ.. ''నా దృష్టిలో స్టార్ కిరీటం అన్నది ఒకటి రెండు చిత్రాల ప్రయాణంతో వచ్చేసేది కాదు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించాలి. ఏళ్ల పాటు ప్రేక్షకులతో కలిసి ప్రయాణం చేయాలి. అప్పుడే స్టార్ అని పిలిపించుకోవడానికి తగిన అర్హత పొందానని భావిస్తా' అని చెప్పుకొచ్చింది. తనను ఎవరైనా స్టార్ అని పిలిస్తే సున్నితంగా అలా పిలవొద్దని చెబుతుంటానంది. ప్రస్తుతం తన దృష్టంతా విభిన్నమైన కథలు, పాత్రలు చేయడంపై ఉందని చెప్పుకొచ్చింది శ్రీలీలా.

మరింత సమాచారం తెలుసుకోండి: