తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ. తమిళ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఇంకా యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ మూవీలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతో విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమా అక్టోబర్ 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ట్రైలర్ రిలీజ్ కు రంగం సిద్ధం చేశారు. ఆగస్టు 12 వ తేదీన అనగా రేపు కంగువ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. భారీ బడ్జెట్ తో తెరకేకుతున్న కంగువ సినిమా కోసం సూర్య అభిమానులు అంతా కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సూర్య డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.


సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ సినిమా ఆకట్టుకుంటుందని సమాచారం తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా కోలీవుడ్ లో రికార్డులు నమోదు చెయ్యడం పక్కా అట.నిజం చెప్పాలంటే.. ఈ మూవీ అక్టోబర్ నెలలో విడుదల అవుతుంది. రెండు నెలలకు ముందే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో సూర్య చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. సూర్య వెనుక రెండు రెక్కలు పెట్టి సూపర్ గా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సినిమా తరువాత సూర్య44 లో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ లోనే సూర్య తలకు గాయం అయ్యింది. ప్రస్తుతం సూర్య హెల్త్ అయితే నిలకడగా ఉందని సమాచారం. మరి ఈ సినిమాలతో సూర్య ఎలాంటి రికార్డులు నమోదు చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: