కళ్యాణ్ రామ్ నందమూరి హరికృష్ణ తనయుడిగా సీనియర్ ఎన్టీ రామారావు వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ చేసిన ఈయన మంచి మంచి కథలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఆ మధ్యకాలంలో ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ లో పడి సినిమాలు కూడా ప్లాఫ్ అయ్యాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ అన్నకు వెన్నంటే ఉంటూ అన్ని విధాల సహాయం అందించారు. అయితే అలాంటి కళ్యాణ్ రామ్ కి హరికృష్ణ కి మధ్య అప్పట్లో చాలా పెద్ద గొడవ జరిగిందట.ఈ గొడవ కారణంగా చాలా రోజులు హరికృష్ణ కళ్యాణ్ మధ్య మాటలు కూడా లేవట.మరి అంత పెద్ద గొడవ ఎందుకు జరిగింది..వీరి మధ్య ఎందుకు మాటల్లేవు అనేది ఇప్పుడు చూద్దాం.. హరికృష్ణ,కళ్యాణ్ రామ్ కి గొడవలు రావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ వై వి ఎస్ చౌదరి. 

అయితే కోయంబత్తూర్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన కళ్యాణ్ రామ్ దగ్గరికి వై వి ఎస్ చౌదరి వచ్చి నేను లాహిరి లాహిరి లాహిరిలో సినిమా చేద్దామనుకుంటున్నాను. ఈ సినిమాని నాన్న కోసం రాశాను. ఆయనని ఎలాగైనా ఒప్పించండి నేనే ఈ సినిమాను నిర్మిస్తానని అన్నారట. ఇక తమ కుటుంబానికి ఎంతో దగ్గర అయినటువంటి వైఎస్ చౌదరి స్వయంగా వచ్చి ఈ విషయం చెప్పడంతో కళ్యాణ్ రామ్ వెంటనే హరికృష్ణ కి మ్యాటర్ మొత్తం చెప్పేసారట.కానీ  వైవిఎస్ చౌదరి మీద హరికృష్ణ కి నమ్మకం లేక చేయనని చెప్పారట. కానీ కళ్యాణ్రామ్ మాత్రం చేయాలి అని పట్టు పట్టారట. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ కళ్యాణ్ రామ్ వైవిఎస్ చౌదరి దగ్గరికి వెళ్లి ఈ సినిమాకి మీరు దర్శకత్వం వహించండి. నేను నిర్మిస్తానని కళ్యాణ్ రామ్ నిర్ణయం తీసుకొని ఇదే విషయాన్ని హరికృష్ణ కి చెప్పారట.

అయితే కొడుకు తీసుకున్న నిర్ణయానికి భయపడిన హరికృష్ణ ఇంత పెద్ద బాధ్యతలు మోయగలడా అని అనుకున్నాడట. దాంతో వద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగి చాలా రోజులు మాట్లాడుకోలేదట. ఆ తర్వాత హరికృష్ణ గొడవ అంతా పక్కనపెట్టి నేను ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండకుండా అమెరికా వెళ్లి చదువు పూర్తి చేయాలి. అలా అయితేనే సినిమా చేస్తానని కండిషన్ పెట్టారట. ఇక తండ్రి కండిషన్ ని ఒప్పుకొని అమెరికా వెళ్లి చదువు పూర్తి చేసి ఆ తర్వాత కొద్ది రోజులు జాబ్ కూడా చేసి వచ్చారట  అలా వైవిఎస్ చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో హరికృష్ణని ఒప్పించడం కోసం నాకు నాన్నకి మధ్య గొడవ జరిగింది అంటూ కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలో చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: