తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో రామ్ పోతినేని ఒకరు. రామ్ ఆఖరుగా ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన ది వారియర్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు.

సినిమా కూడా అద్భుతమైన అంచనాల నడుమ విడుదల అయింది. కాకపోతే ఈ మూవీ కూడా రామ్ కి నిరాశనే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే ఈస్మార్ట్ శంకర్ మూవీ తో రామ్ పోతినేని కి మంచి విజయం దక్కింది. దానితో పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని హీరోగా తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి కొనసాగింపుగా డబల్ ఇస్మార్ట్ అనే పేరుతో ఓ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ పర్వాలేదు అనే స్థాయిలోనే ప్రచారాలను చేస్తూ వస్తుంది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం ఈ నెల 12 వ తేదీన వరంగల్ లో ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు. దానితో వరంగల్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: