నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత వేణు స్వామి చెప్పిన జాతకం మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు.మరీ ముఖ్యంగా నాగచైతన్య మొదటి భార్యతో ఎలా అయితే విడాకులు తీసుకున్నాడో రెండో భార్యతో కూడా అంతే..కేవలం వీరి మధ్య బంధం 2027 వరకు మాత్రమే సఖ్యతగా ఉంటుంది.ఆ తర్వాత అనుకొని గొడవలు వచ్చి వీళ్ళిద్దరూ ఓ స్త్రీ కారణంగా విడాకులు తీసుకుంటారు అంటూ సంచలన విషయం బయట పెట్టారు. అంతేకాకుండా వీరి గురించి ఇంకా ఎన్నో షాకింగ్ విషయాలు కూడా బయట పెట్టారు. అలాగే 10%  నాగచైతన్య,శోభితల మధ్య బంధం ఉంటుంది.

అంతకుమించి వీరి మధ్య బంధం ఉండదు. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం కూడా బాగాలేదు.అసలు ఈ ముహూర్తంలో వీళ్ళిద్దరూ ఎందుకు  ఎంగేజ్మెంట్ చేసుకున్నారో.వీరి జాతకంలో నేను చెప్పిన విషయాలు జరగకూడదని, వాళ్ళు హ్యాపీ గా ఉండాలని నేను కోరుకుంటాను అంటూ వేణు స్వామి సంచలన కామెంట్లు చేశారు. అయితే తాజాగా వేణు స్వామి చేసిన కామెంట్లపై నాగచైతన్య గతంలో మాట్లాడిన వీడియోని ట్యాగ్ చేస్తూ అక్కినేని అభిమానులు వేణు స్వామిని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య నీకు జాతకాలపై ఎలాంటి నమ్మకం ఉంటుంది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అని దగ్గుబాటి రానా నెంబర్ వన్ యారి విత్ రానా అనే ప్రోగ్రాంలో అడిగారు.

రానా మాట్లాడుతూ.. జాతకాలపై నీ నమ్మకం ఏంటి అని అన్నాడు..దానికి నాగచైతన్య దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. జాతకం నమ్మడం నమ్మకపోవడం అనేది నా సౌకర్యం మీద ఉంటుంది. ఎందుకంటే నా జాతకం బాగుంది అని చెబితే నమ్ముతాను.ఒకవేళ నా జాతకం అస్సలు బాలేదు అని చెప్తే దాన్ని అస్సలు పట్టించుకోను..అంటూ నాగచైతన్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే నాగచైతన్య మాట్లాడిన ఈ పాత వీడియోని ప్రస్తుతం వేణు స్వామి మాట్లాడిన వీడియోకి ట్యాగ్ చేస్తూ అక్కినేని అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: