తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన వారిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. ఈమె రామ్ పోతినేని హీరోగా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ను అందుకుంది. ఈ మూవీ తర్వాత కూడా ఈమె నటించిన పోకిరి , జల్సా , రాఖీ ,  కిక్ ,  జులాయి ఇలా అనేక సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

దీనితో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లడం మాత్రమే కాకుండా చాలా కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ ఉన్న హీరోయిన్గా కెరియర్ను కూడా కొనసాగించింది. ఇకపోతే ఈమె స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే తమిళ సినీ పరిశ్రమపై కూడా ఇంట్రెస్ట్ లో చూపడం మొదలు పెట్టింది. తమిళ సినీ పరిశ్రమ ఈమెను బ్యాన్ చేసింది. దానికి ప్రధాన కారణం ఈమె ఒక తమిళ సినిమాకు అడ్వాన్స్ తీసుకొని ఆ సినిమా చేయకపోవడంతో తమిళ ఇండస్ట్రీ ఇలియానా పై బ్యాన్ విధించింది. దానితో ఈమె తన ఇంట్రెస్ట్ ను అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్నా కూడా తెలుగు పై కాకుండా హిందీ ఇంట్రెస్ట్ పై చూపించడం మొదలు పెట్టింది.

ఈమె హిందీ సినిమాలలో నటించిన అవి పెద్ద స్థాయి విజయాలను సాధించకపోవడంతో ఈమెకు అక్కడ కూడా అవకాశాలు తగ్గాయి. ఇకపోతే తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న సమయంలోనే ఈమె ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది. ఈమె కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీపై మాత్రమే ఫోకస్ పెట్టి ఉంటే ఇప్పటికీ కూడా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటూ ఉండేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ బ్యూటీ ఆఖరుగా తెలుగులో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత ఈమె తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: