సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలా మంది హీరోలు ఒక సారి కథ చెప్పిన తర్వాత ఆ సినిమా నచ్చనట్లు అయితే చేయొద్దు అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఆ తర్వాత ఆ సినిమా చేయవలసిన పరిస్థితిలు ఏర్పడతాయి. అలా రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో కూడా జరిగిందట. ఒక సినిమా కథను మొదట వినిపించినప్పుడు ఆయనకు నచ్చలేదు అంట ... కానీ ఆ తర్వాత ఆ సినిమా చేయవలసి వచ్చింది. అసలు ఆ సినిమా ఏది ..? ఎందుకు చేయవలసి వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ నిరూపించాడు. దశరథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి సంబంధించిన కథను దశరథ్ , దిల్ రాజుకు చెప్పిన తర్వాత ఈ కథ ప్రభాస్ కి బాగుంటుంది అని దశరథ తో ఈ మూవీ కథను ప్రభాస్ కి దిల్ రాజు వినిపించాడట. ఇక కథ విన్న ప్రభాస్మూవీ ఫస్ట్ అఫ్ బాగుంది , సెకండాఫ్ గొప్పగా లేదు అని చెప్పాడట. దానితో దిల్ రాజు కొన్ని రోజుల్లో సెకండ్ హాఫ్ కంప్లీట్ చేసి మీకు వినిపిస్తాను అని అన్నాడట.

ఇక దిల్ రాజు సెకండాఫ్ కూడా పూర్తి అయింది అని ప్రభాస్ కి చెప్పిన తర్వాత ప్రభాస్ మాత్రం ఈ సినిమా అస్సలు చేయొద్దు అని చెబుదాము అని దిల్ రాజు దగ్గరికి వెళ్ళాడట. కథ విని చెయ్యను అని చెప్పాలి అనుకున్నాడట. కాకపోతే కథ మొత్తం విన్నాక సూపర్ గా నచ్చిందట. ఆ తర్వాత ప్రభాస్ తో దిల్ రాజు ఈ కథతో సినిమా చేయొద్దు అనుకున్నాను. కథ విని ఆ విషయం చెప్పాలి అనుకున్నాను. కానీ మీరు సెకండ్ హాఫ్ చాలా బాగా డెవలప్ చేశారు. అందుకే ఈ సినిమా చేస్తున్నాను అని అన్నాడట. ఈ విషయాన్ని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: