పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కావడంతో ఈయన నటించిన మొదటి సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు ఆ సమయంలో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు మొదటి బ్లాక్ బాస్టర్ విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది తొలిప్రేమ సినిమాతో. ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తో పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది.

తొలిప్రేమ భారీ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే ఆసక్తి ఎంతో మందిలో నెలకొని ఉంది. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే ప్రశ్న ఎదురయింది. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ తొలిప్రేమ సినిమా ఓకే అయిన సమయంలో నాకు పెద్దగా క్రేజీ లేదు. దానితో వారు నాకు కొంత మొత్తం రెమ్యూనరేషన్ ఇస్తాము అన్నారు.

సినిమా స్టార్ట్ అయ్యింది ... మేము అనుకున్న దాని కంటే సినిమాకు బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాతలు సినిమా పూర్తి అయిన తర్వాత లాభాలు వస్తే రెమ్యూనరేషన్ ఇస్తాము అన్నారు. నేను కూడా బడ్జెట్ ఎక్కువ అయింది ... కదా సినిమా మంచిగా ఆడి లాభాలు వస్తే తీసుకుందాం అనుకున్నాను. ఇక సినిమా విడుదల అయ్యింది. బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానితో నిర్మాతలకు కూడా బాగానే డబ్బులు వచ్చాయి. వారు మొదట నాకు ఇస్తాను అన్న రెమ్యూనరేషన్ ఇచ్చేశారు. అని పవన్ కళ్యాణ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశాడు. ఇకపోతే ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ నటనకు గాను ఆ సమయంలో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: