మాస్ మ‌హరాజా రవితేజ, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. మిర‌ప‌కాయ్ సినిమా త‌ర్వాత రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబోలో ఈ సినిమా వ‌స్తుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌ అభిమానిగా కనిపించ‌నున్నాడు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగ‌ష్టు 15న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో మేక‌ర్స్ బిజీగా ఉండ‌గా.. హరీష్ శంకర్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు.హరీష్ శంకర్ అంటే మాస్ కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు. ఇక ఆయన చేతిలో ఓ రీమేక్ పడిందే.. దాని స్వరూపమే మారుతుంది. పాయింట్‌ను పట్టుకుని మన నేటివిటీకి, మన ఆడియెన్స్‌కి ఏం కావాలో అవన్నీ చేర్చి తన స్టైల్లో కొత్త సినిమాను తీస్తాడు. అలా తీసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిందీలో దబాంగ్ కంటే.. తెలుగులో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక వరుణ్ తేజ్‌తో తీసిన గద్దలకొండ గణేష్ తమిళంలో జిగర్తాండ కంటే మంచి హిట్‌గా నిలిచింది. అలా హరీష్ శంకర్ చేతిలో ఓ రీమేక్ పడితే పూర్తిగా మారిపోతుంది.ఇప్పుడు హరీష్ శంకర్ రైడ్ మూవీని మిస్టర్ బచ్చన్ అంటూ రీమేక్ చేశాడు. రవితేజకు తగ్గట్టుగా పూర్తి మార్పులు చేర్పులు, అదిరిపోయే డైలాగ్స్‌తో హరీష్ శంకర్ మోస్ట్ పవర్ ఫుల్‌గా సినిమాను మలిచాడనిపిస్తుంది. టీజర్, ట్రైలర్‌లు చూస్తుంటే మాస్‌ ఆడియెన్స్, క్లాస్ ఆడియెన్స్‌కు అందరికీ నచ్చేలా తెరకెక్కించినట్టుగానే కనిపిస్తోంది.తాజాగా, ఓ నెటిజన్ ‘‘ అసలు ఏం అనుకుంటున్నావ్ అన్నా.. రీమేక్ సినిమాలు ఎందుకు వద్దు అంటున్నామో చెప్పడానికి మాకు బోలేడు కారణాలున్నాయి. రీమేక్ మూవీలే ఎందుకు చేయాలనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పు. రీమేక్ అయితే కేవలం మన ఫ్యాన్స్ చూస్తారు అన్నా. కానీ న్యూట్రల్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి. ప్లీజ్ చేంజ్ చేయండి’’ అని రాసుకొచ్చాడు. ఇక అది చూసిన హరీష్ శంకర్ చూసే నీకే అంత కన్సర్న్ ఉంటే.. తీసే నాకెంత ఉండాలి’’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ప్రజెంట్ వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతున్న మిస్టర్ బచ్చన్ కూడా రీమేక్ అని తెలుస్తోంది. అయినప్పటికీ హరీష్ శంకర్ బాగా తీయడం వల్లనే అలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: